ముత్యాల హారాలు;-మీసాల సుధాకర్.;--పి.జి.టి-తెలుగు.--ఖిలాషాపురం, జనగామ జిల్లా.
గోరుముద్దలు తినిపించు.
మంచికథలు వినిపించు.
చెడు చేస్తే మందలించు.
అమ్మ ప్రేమను చూపించు.

అమ్మను పూజించుము.
నాన్నను సేవించుము.
దేవుని ధ్యానించుము.
మోక్షము సాధించుము.

సంకల్పం కావాలి.
సాధనమును చేయాలి.
ఓర్పు కలిగి ఉండాలి.
విజయం సాధించాలి.

చెడు మాటలు వినరాదు.
చెడు పనులు చేయరాదు.
చెడు దారులు నడువరాదు.
పరుల ఉసురు తీయరాదు.

చదువు నేర్చుకోవాలి.
తెలివి పెంచుకోవాలి.
భవిత మార్చుకోవాలి.
ప్రగతిబాట నడవాలి.

కామెంట్‌లు