చిలుకా చిలుకా ఏవూరూ?చిక్కడపల్లీ మావూరోయ్!చిలుకా చిలుకా నీపేరోయ్?చిట్టితల్లీ నాపేరోయ్!హంసా హంసా ఏవూరూ?హనుమకొండా మావూరోయ్!హంసా హంసా నీపేరోయ్?హంసానందిని నాపేరోయ్!కాకీ కాకీ ఏవూరూ?కాకీనాడా మావూరోయ్!కాకీ కాకీ నీపేరోయ్?కరుణారాణి నాపేరోయ్!బాబూ బాబూ ఏవూరూ?బనగానపల్లె మావూరోయ్!బాబూ బాబూ నీపేరోయ్?బాలూ బాబూ నాపేరోయ్!పాపా పాపా ఏవూరూ?పానగల్లు మావూరోయ్!పాపా పాపా నీపేరోయ్?పద్మలత నాపేరోయ్!*********************************
వూరూ - పేరూ ;---ఢా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి