అసలు బాధ(నానో కథ)-సుమ కైకాల
 " ఏంటండీ.. పొద్దున్నే అంత దిగులుగా కూర్చున్నారు?"అంది అనిత.
"ఓ అందమైన అమ్మాయి వచ్చి నిన్ను చంపేసి నన్ను పెళ్లిచేసుకుని తనతో
తీసుకెళ్లిపోయిందని కలొచ్చింది, చాలా బాధగా ఉంది అనూ!" అన్నాడు ఆనంద్.
"అయ్యో! అది కలేగా... వదిలేయండి, ఎందుకంత బాధ పడుతున్నారు" అంది భర్తకి తన మీద ఉన్న ప్రేమకి మురిసిపోతూ.
"నేనూ అందుకే బాధపడుతున్నాను అనూ! అది కలే కదా అని" అన్నాడు నిట్టూర్పు విడుస్తూ ఆనంద్.
***

కామెంట్‌లు