తెల్లమందారాలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తెల్లమందారాలు
వెలుగులు చిమ్ముతున్నవి
కమ్మదనాలు
కళ్ళను కట్టిపడేస్తున్నవి

తెలుపుమందారాలు
స్వచ్ఛముగానున్నవి
కళంకములులేక
కుతూహలపరుస్తున్నవి

శ్వేతమందారాలు
సమూహముగానున్నవి
చూపరులను
సంబరపరుస్తున్నవి

గౌరమందారాలు
చెట్టుకి
ఆకులు తక్కువుగాను
పూవులు ఎక్కువగానున్నవి

ధవళమందారాలు
చక్కగానున్నవి
తేనెను
తేటులకొరకుదాచుకొనియున్నవి

శుక్లమందారాలు
దివ్వెలులాయున్నవి
కార్తీకమాసపు
దీపకాంతులుచిమ్ముచున్నవి

హరిణమందారాలు
తెంచుకోమంటున్నవి
తరుణికొప్పులో
తురుమమంటున్నవి

అర్జునమందారాలు
విచ్చుకొనియున్నవి
వయ్యారాలను
ఒలకబోస్తున్నవి

రజతమందారాలు
చెప్పుచున్నవి
ఎరుపొకటేకాదు
తెలుపూబాగుంటుందని

తెల్లనిమందారాలు
తెరువరులను
ఆకర్షిస్తున్నవి
అలరిస్తున్నవి

స్వచ్ఛమందారాలు
సంతసపరుస్తున్నవి
ధవళకాంతులతో
ధగధగలాడుచున్నవి

=====================

మందార మధురిమలు
మగువల మాత్రమేకాదు
మగవారి మనసులను
మరిపించి మురిపించు

కన్నంత మందారపువ్వులు
కళ్ళను తెరిపించిపెద్దజేయు
మనసునంత దోచు
ముచ్చటలందు ముంచు

మందారమాట చెవులచేరగను
మదినితట్టు పోతనపద్యంబు
మరియు గజేంద్రమోక్షంబు 
మురిసిపోవు మస్తకంబు 

మందారము
మకరందము
మదనము
మాధుర్యము

కామెంట్‌లు