సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 విభవము...విభావము
  *****
తామెంతో విభవంగా బతకాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
విభవము అంటే ఏమిటో చూద్దాం. ఉన్నత స్థితి,ఉన్నతి,సంప్రతిష్ఠ, ధనము, ఆదాయము, పవిత్రము,పైకము,భోగ్యము, యోగము,సంపద, ఆస్తి లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
మరి ఎవరికి మాత్రం ఉండదు ఉన్నత స్థితిలోనూ, పదవిలోనూ ఉండాలని.ఠీవిగా తలెత్తుకుని తిరగాలని, ఆర్థికంగా ఉచ్ఛస్థితిలో  ఉండి సమాజంలో తన గరిమను,విభవాన్ని చాటుకోవాలని...
తనదైన ముద్రతో సమాజంలో వెలుగొందుతూ తన విభావము జరగాలని కోరుకోవడంలో ఎలాంటి దోషం లేదు.అవసరం కూడా... ఉన్నత స్థితిలో ఉన్న తన వల్ల సమాజానికి గణనీయంగా మేలు జరగాలి. అది పదిమందికి ఉపయోగపడే మంచి పనైతే తనకు తెలియకుండానే ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా విభావము అవుతాడు.
ఇంతకూ విభావము అంటే ఏమిటో చూద్దాం. విభావము అంటే పరిచయము,ఎఱుక,మాలిమి,పరిచితి లాంటి అర్థాలు ఉన్నాయి.
సర్వతోముఖ విభవముతో వెలుగొందుదాం.
మంచితనం మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా విభావము అవుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు