విద్యార్థుల చే దేశభక్తి' పుస్తకావిష్కరణ ; డి.కె.చదువులబాబు

  ప్రముఖ కథా రచయిత, తెలుగు భాషోపాధ్యాయుడు డి.కె. చదువుల బాబు రచించిన దేశభక్తి బాల సాహిత్య కథా సంపుటిని పొద్దుటూరు మండలము కొత్తపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల చేత ఆవిష్కరించారు.నవంబరు14న  బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు హిమజాత మాట్లాడుతూ పిల్లలతో బాలలపుస్తకాన్ని ఆవిష్కరించడం ఓప్రత్యేకమైన విషయమని,పిల్లల్లో సృజనాత్మక సామర్థ్యాన్ని, మంచి లక్షణాలను పెంపొందించే పుస్తకాలను చదివించే దిశగా పిల్లల్ని ప్రేరేపించడము ప్రతి ఒక్కరి బాధ్యత, బాల సాహిత్య పుస్తకాలను చదివే పిల్లలు బట్టి పట్టే పద్ధతిలో కాకుండా అవగాహన చేసుకుని వారి యొక్క స్వీయ రచనా సామర్థ్యాన్ని కలిగి ఉంటారన్నారు. కథలప్రాధాన్యతను తల్లిదండ్రులు,ఉపాధ్యాయులుగుర్తించాలన్నారు.సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు గురప్ప మాట్లాడుతూ
ఇటువంటి  పుస్తకాలను చదవడం విద్యలో ఒక భాగం అని బాల సాహిత్యం పిల్లల్లో శ్రవణం, భాషణం, పఠణం, లేఖనం, అవగాహన సామర్థ్యాలను, పెంపొందించ టానికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఒంటేరు రమాదేవి మాట్లాడుతూ బాలసాహిత్యం బాధ్యత, విచక్షణ, భావగాహన, మానసిక వికాసం, నీతి నియమం, సత్ప్రవర్తనవంటి ఉత్తమ లక్షణాలను పెంపొందిస్తుందన్నారు. శాంతకుమారి మాట్లాడుతూ ఏదేశంలో బాలసాహిత్యం అమిత ఆదరణ పొందుతుందో ఆ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. కృష్ణమాధవీలత మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో తన రచనలను అనేక పత్రికల్లో ప్రచురించి దాదాపు ఇప్పటి వరకు 21 పుస్తకాలను రచించి, 700 కథలను, 
50 కి పైగా గేయాలను, 100 పైగా  కవితలను, 50 పైగా సాంఘిక కథలను రచించిన డి.కె. చదువుల బాబు  సాహిత్యరంగంలో విశేష కృషి చేస్తున్నారని అభినందనలు తెలిపారు.పద్మావతి మాట్లాడుతూ బాల సాహిత్యానికి సాహిత్య ప్రక్రియల్లో ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. పుస్తకపఠనానికి ప్రతి పాఠశాల ఒక పీరియడ్ కేటాయించాలన్నారు. పాఠశాల గ్రంథాలయాన్ని నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.  సత్ ప్రవర్తన,దేశభక్తి కల భావిభారత పౌరులను రూపొందించడంలో బాలసాహిత్యం ప్రముఖ పాత్రవహిస్తుందన్నారు. డి.కె.చదువులబాబు రాయలసీమలో ప్రథమ స్థానములో బాల సాహిత్యాన్ని సృష్టిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ పిల్లలతో మంచి బాలల పుస్తకాలను చదివించాలని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో హిమజాత, గురప్ప, రమాదేవి,శాంతకుమారి,కృష్ణ మాధవీలత, పద్మావతి, విద్యార్థులు  పాల్గొన్నారు.
  9440703716
కామెంట్‌లు