గగనపు వేదికపై
ఉదయరాగాలతో
తూరుపు వీణపై
కిరణాల కచేరీ
తోరణాలు కట్టిన తరువులు
స్వాగతాలు పలికిన పత్రాలు
చేతులు జోడించిన శిఖరాలు
హారతిచ్చిన మబ్బులు
నిదురించే లోయల
ప్రతిధ్వనించే నిశ్శబ్దం
వెలుగుతో చేరి మౌనంగా
ఆస్వాదిస్తున్న సంగీతం
మధుర రాగసుధా తరంగాల
పరిమళం మోస్తూ
కలయతిరుగుతున్న
గాలుల కదలికలు
నింగిలో నిత్యం జరిగే
అందమైన అద్భుతం
ఆనందంతో వేకువకు
మది పాడే స్వాగతం
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి