జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలకు కె.వి.ఆర్ స్కూల్ విద్యార్థులు నటించిన జై భారత్ షార్ట్ ఫిల్మ్ ఎంపిక.

 యస్.వి మోహన్ రెడ్డి జాతీయ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదర్శనకు కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్
స్థానిక కె.వి.ఆర్ గార్డెన్స్ లోని కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారి ప్రోత్సాహంతో పాఠశాల లైబ్రేరియన్,చిత్రకారుడు,కవి,రచయిత బోయ శేఖర్,  ఎనిమిదవ తరగతి విద్యార్థినిలు నటించిన జై భారత్ షార్ట్ ఫిల్మ్ ఎంపికైనట్లు తెలియజేశారు.
ప్రతి ఒక్క విద్యార్థుల్లో దేశ భక్తి,క్రమశిక్షణ,బాధ్యత పెంపొందలనే ఉద్దేశంతో జై భారత్ షార్ట్ ఫిల్మ్ నిర్మించినట్లు కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి తెలిపారు,నటీనటులకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
అనంతరం డైరెక్టర్ బోయ శేఖర్ మాట్లాడుతూ 
ప్రతి ఒక్క విద్యార్థి దేశభక్తి పెంపొందించుకుని బాధ్యత కలిగిన దేశం గర్వించే దేశ పౌరులుగా ఎదగాలని నటీనటులకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు