చీకటిలో... లోకం...!
వెలుతురుకై తహ - తహ !!
మేలుకుని... పరస్పరం...
పలుకరించుకు ...
. పులకించును ప్రకృతి .... !
పంచభూతాల...
అవినాభావ...
సంబంధ మిదియే... !
వెలుగును చూసి...
ఆకాశం రంగు లద్దు కుంటుంది !
గాలి పరిమళాలు నింపుకుని
స్వేచ్ఛగా విహరిస్తుంది !
నీరు, దర్పణమై ... మీ మీ
అందాలుచూసుకు...
మురిసిపోమంటుంది... !!
కళా హృదయులైన...
మనుషులను...
ఈ అందాల ఆనందాలను
అనుభూతించి, ఆస్వాదించి
కవిత్వీకరించి....అందరినీ రంజింప జేస్తూ....
ఖ్యాతినార్జించ మంటోంది !
ఈ వెలుగుకెంత మహత్తు !"
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి