శ్రీమతి ఎం. వి. ఉమాదేవి కి "మధుర కవిచంద్ర" బిరుదు ప్రదానం

 మల్లినాథసూరి కళాపీఠం, ఏడుపాయల సంస్థాన్, సుధాత్రి తెలంగాణ, జాతీయ సాహిత్య ధార్మిక సంస్థలు సంయుక్తంగా బాసర వాసవీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం    బాసర నవక్షేత్రయాన్ జాతీయ కవుల మహా క్రతువు నిర్వహించారు. ఈ సందర్బంగా నెల్లూరు/బాసర రచయిత్రి శ్రీమతి ఎం. వి. ఉమాదేవి గారు తన  114 రచనల పీడీఎఫ్ సమర్పించారు.  అమరకుల దృశ్యకవిగారు స్వర్ణ సమత గారు,సమీక్షకులబృందం  ఉమాదేవికి  ఘన సత్కారంతో "మధుర కవిచంద్ర" బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా పలువురు కవి మిత్రులు ఉమాదేవికి అభినందనలు తెలిపారు.తాను పాల్గొన్న తొలి సభ ఇదే అని,  చాలా సంతోషంగా ఉందని ఉమాదేవి అందరికి ధన్యవాదములు తెలిపారు.

కామెంట్‌లు