ఆత్మల పండుగ; -:డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 దేహం వదిలినా జీవం పోదు
మమకారాల మధురిమలు
మాసిపోలేదు
కొవ్వొత్తుల వెలుగుల్లో జ్ఞాపకాలు కన్పిస్తాయి
సమాధులపై పుష్పగుచ్ఛాలు
చెదిరిన మనసులను శాంతపరుస్తాయి.
బంధాల పరిమళాలు వెదజల్లబడుతుంటే
బ్రతుకొక సందేశాన్నిస్తుంటుంది.
పోయినోళ్ళంతా మంచోళ్ళని
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగుర్తులని చెబుతుంది
మంచి,చెడులనిక్కడే వదిలేసి
సంపదలు,అధికారాలు,
పదవులు,అనుబంధాలు
త్యజించిన‌ పెద్దలు భువికి
దిగివచ్చే పవిత్రవేళలో
ఆర్ద్రమైన మనసుల ప్రార్థనలే
మనుషుల చిరునామాలవుతాయి.
కామెంట్‌లు