.భరతుడు;-ఎం. వి. ఉమాదేవి.
ఆట వెలదులు 
అన్నగారియెడల ననురాగ పూర్ణుoడు 
మిన్నయైన నీతి మిగులగల్గి 
తల్లిచేతలకును తనయుడై కోపించి 
పిలువవచ్చెతిరిగి ప్రేమమీర!!

రాముడానతీయ రాజ్యపాలనజేసె 
పాదుకలను బెట్టి పావనముగ
సత్యధర్మ శీలి శాంతమ్ము గలవాడు 
భరతుడన్నమీద భక్తి పరుడు!!


కామెంట్‌లు