మరుగుపరచుకోవలసిందే !;--కోరాడ నరసింహా రావు.
నేను, నేనుగా...      కనిపించలేకపోతున్నాను... ! 
నీ దగ్గర నీకునచ్చిన ముఖంతో 
వీడి దగ్గర వీడికి  నచ్చిన... 
   వాడిదగ్గర  వాడికి నచ్చిన 
 ఈ సమాజంలో ఎవరిదగ్గర.. 
 వారికినచ్చిన ముఖం మాస్కు లనుతగిలించుకుని..,సమయానికి, సందర్భానికీ తగిన రీతిలో 
నటిస్తూ బ్రతికే పరిస్థితి... !

    నాకు నచ్చినట్టు...స్వేచ్ఛగా, 
ధైర్యంగా... నేను,నేనుగా బ్రతక గలిగే అవకాశమేదీ... ?!

నా అభిరుచుల్నీ... ఆశలనీ.... 
 కోరికలని, ఆశయాలనూ, అభి ప్రాయాలనూ ఉన్నవి, ఉన్నట్టు ప్రకటించగలిగే ధైర్యం నాకెక్క డిది...!?

నా బ్రతుకు బాటలో... ఎన్నెన్ని 
పరిచయాలో..!ఎన్నిరకాలమన స్తత్వాలో... !!
 సహజీవనంచెయ్యాల్సినసమా
జంలో సర్దుకుపోకతప్పదు కదా
నలుగురితో కలిసి బ్రతకాలంటే 
ఎప్పటికప్పుడు,తదనుగుణంగ మాస్కులుమార్చుకోవలసిందే!
నీ నిజరూపాన్ని మరుగుపరచు కోవలసిందే .... !
     ********

కామెంట్‌లు