దండము ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
మురళి మాతకు దండము 
కృష్ణయ్య కరములకు దండము 
మురళీ రవానికి కొండలె కరిగెనట
వేదాలు మారు మ్రోగెనట
గోవులన్ని తృప్తి చెందెనట 
మృగాలన్నీ పరవశించెనట
భువనమంత ఓంకారము నిండెనట 
లతగుల్మవృక్షాలేవీ కదలవట 
పూలన్నీ పూర్తిగ వికసించెనట 
సువాసనలే ప్రవహించెనట 
అందుకే మనమంతా
కృష్ణయ్య కరతలము అలంకరించిన 
మురళిమాతకు పెడదాం దండము
కృష్ణయ్య కరములకు పెడదాం దండము!!


కామెంట్‌లు