పత్రికలు పుట్టాయి... !
కూపస్థ మండూకాల్లా...
బ్రతుకుతున్న ప్రజలకు...
ప్రపంచంఏమిటో,ఎలావుందో
తెలిసి వచ్చింది.... ! !
ఉదాసీన మనస్సులో...
చైతన్యాన్ని తెచ్చాయ్ !
మనుషులు దూరంగా ఉన్నా
మనసుల్ని సంఘటిత పరచి
ఉద్యమాలకుఊతమిచ్చాయి
అన్యాయాలు, అక్రమాల
ఆట కట్టించి..,హద్దుల్లోఉంచే ప్రయత్నాలు చేసాయి... !
అక్షరాలను ఆయుధాలుగా మలచుకుని...,అపసవ్యాలతో సమరాలు చేస్తూ సక్రమంగా నడిపించే కృషిని నిరంతరం...
కొనసాగిస్తూనే ఉన్నై.... !
ఈ ఉద్యమంలో నిజాయితీగల ఎందరో విలేకర సైనికులు బలై పోయినా పోరాటం లో వెన్ను చూపని ధైర్య, స్తైర్యాలు ప్రదర్శి స్తూనే ఉన్నై.... !
నవసమాజ నిర్మాణంలో...
పత్రికలదే ప్రధాన భూమిక !
పత్రికలు స్వేచ్ఛా, స్వాతంత్ర్యా లతో మనగలిగినప్పుడే....
సుస్థిరశాంతి,సౌఖ్యాల
సమాజం....!
సాహిత్య, సాంస్కృతిక వికాసానికీ పత్రికలే పట్టుకొమ్మలు.... !
పత్రికలు లేని సమాజంలో...
ప్రజాస్వామ్యానికి అవకాశమేఉండదు !
నిరంకుశ రాచరిక పాలనై...
ప్రజలకు సుఖ, శాంతులు కరువైపోతాయి.... !!
నిష్పక్షపాతంగా పనిచేసే...
పత్రికలు... వర్ధిల్లాలి... !
ప్రజాస్వామ్యం పరిరక్షించ బడాలి... !
అన్ని రంగాలలో వికాసవంతమైన సమాజం నిర్మింప బడాలి
జయహో పత్రికా రంగం... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి