సుప్రభాత కవిత ; -బృంద
ఏ  మాయని మమత
వల్లో మనసు నిండిన తడికి
ఊరటనిచ్చే  కమ్మని కబురేదో
అందించాలని ఆత్రమో!


నిదురకాచి ఎదురుచూస్తున్న 
ఏ మదికి కుదురు తెచ్చే 
కమ్మని కబురు సందేశంగా
అపురూపంగా తెస్తోందో!

అపుడే కళ్ళు తెరిచిన
పూలకూనలకు బహుమతిగా
ముచ్చటగా ముద్దుల
జల్లు చిలకరించాలని వస్తోందో!

కలలు తీరిన  ఆనందంతో
కమ్మిన కన్నీటి తెరలలో
ఏ హరివిల్లు రంగులు  
నింపాలని వస్తోందో!

పచ్చని పరువపు ప్రకృతికి
అభ్యంగనం చేయించాలని
వెచ్చని జల్లులు చిలిపిగా
కురిపించానుందేమో!

తొలికిరణాల తాకిడికి
రేకువిప్పాలని శ్రేణులుగా 
చూస్తున్న విరిబాలల ఆటపట్టించానుకుందో!

గుండెనిండా నిండిన రూపాన్ని 
నింగిలో మురిపెంగ చూస్తున్న
చెరువుకు కరువుతీరేలా
సంతోషం  ఇవ్వాలనుకుందో!

ప్రేమంతా కురిపించి
మమతలో ముంచేసి
మళ్లీ  మరో మజిలీకై
మరలిపోయే మబ్బులు

మనకెన్నో శుభాలను తెచ్చే
మేఘమాలలకు మనసుతీర 
మౌనంగా  పలికేటి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు