భక్త హనుమ;-     సత్యవాణి
  అమ్మా  సీతమ్మ తల్లీ! ఏమి నా నిర్భాగ్యము.నా రామచంధ్రప్రభువునకు సేవజేసుకొనే భాగ్యము కొరవడినదే !
                ఎవరికి వారు నా ప్రభువుకి సేవలు సలుపుచుండిరి,నావరకు చిన్న కార్యము విడిచి పెట్టకున్నారు.
            రామచంద్రుని అన్నదమ్ములు మువ్వురు లక్షణ ,భరత, శత్రుఘ్నులు వంతులు లేకుండగనే అన్న నోటినుండి మాట వచ్చిందే తడవుగా ,ఆజ్ఞగా శిరసావహిస్తున్నారు. ఇక సేవకుల మాట చెప్పనక్కర లేదు తల్లీ!ప్రతివారూ ,రామచంద్రుని ఆజ్ఞాపాలనము వారి వారి భాగ్యముగా తలచి ,సేవలను ఒనరించు చున్నారు.
                      అమ్మా జానకీమాతా!నా స్వామి సేవ చేయుటకు తగని ఈ దేహమువున్నను వూడినను యొక్కటేగదా!
                 అమ్మా! ఏమందువు?ఎవ్వరే యే సేవలు నా రామ భద్రునికి యొనరించు చున్నారో గమనించి, ఆ విధంగా అందరూఏ ఏ సేవలు చేయుచున్నారో పట్టిక వ్రాయమందువా?
 అటులనే ధరణిజా! నీవు చెప్పినవిధంగానే పట్టిక వ్రాసి,అందరూ రాముని సేవలు చేసెయ్యగా మిగిలిన పని ఏమున్నదో ఆపని నేనే చేయుటకు అనుమతినిమ్మని ఆరామచంద్రునే వేడెద.  అటుల పట్టిక వ్రాయగా మిగిలిన పని రామచంద్రుడు ఆవులించినపుడు
చిటికలు వేయు పని యొక్కటిమాత్రం మిగిలినది. ఆయొక్క పనికి మాత్రము యెవ్వరునూ నియమించ బడలేదు గనుక ఆపనిమాత్రం నేనే చేయవలె.
        ఆహా!     రామసభ ఎంతసుందరంగా యున్నది.సింహాసనంపై కొలువు దీరిన నా రామచంధ్రప్రభువు
ఎంత నయన మనోహరంగాయున్నాడు.
                            నా రాముడు ఎన్నడు ఆవులించునో,నేనెప్పుడు రామకార్యంలో భాగంగా  చిటికెలు వేసెదనోగదా!
                 అయ్యో !నేనెంత పిచ్చి హనుమను?సకలకళావల్లభుడు నారామచంద్రమూర్తి,పరిపాలనా దక్షుడు,రామరాజ్యస్థాపకుడు,నిత్య ఉత్సాహియైన నా ప్రభువు సామాన్య మానవునిలా సోమరియా యేమి?అతడు ఆవలించడానికి,నేను చిటికెలు వేయడానికి?
              ఇప్పుడు నా శ్రీరాముడు ఆవలించపోతేనేమి?  ఏ జన్మలో ఎప్పుడు ఆవులించునో, ఎప్పుడు నాకు చిటికెలు వేసే అవకాశం వచ్చునో ,అప్పటివరకు నేను నారాచంద్రుని మొఖంలోనికి క్షణం ఏమారక చూచుచునేయుందును
అది ఎన్నియుగములైనా నారామభద్రుని నా కనుపాపలలో నిలుపుకొనేయుందును.ఈ బృత్యునికి రామకార్యమునకు మించినదేమున్నది?
జై శ్రీరామా జైజై శ్రీరామా      
          

కామెంట్‌లు