సమ్మోహనాలు ;-ఎం. వి. ఉమాదేవి బాసర.
ముక్తపదగ్రస్థము 
(1024)
============
చెట్టుపై పక్షులవి 
పక్షి సమూహములవి 
సమూహం ఆకులుగ శోభిల్లె ఓ వనజ !!

గువ్వలూ చిలకలూ 
చిలకతో జంటలూ 
జంటగా సంతుతో కొలువయ్యె ఓ వనజ !

శిశిరాన దృశ్యమిది 
దృశ్యంగ అలరినది 
అలరించి అద్భుతం అనిపించు ఓ వనజ !

ఆకురాలిన తరువు 
తరువు ఎక్కిన బరువు 
బరువుగా మురిసెనే పిట్టలవి ఓ వనజ !!

ప్రకృతిలో అందాలు 
అందమై అమరికలు 
అమరికలు సమ్మోహనములయ్యె ఓ వనజ !!


కామెంట్‌లు