మాపాప ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

రామచిలుకకు 
మాటలు నేర్పును మాపాప
నెమలి భామకు
నాట్యం నేర్పును మాపాప
లేగదూడకు
గెంతులు నేర్పును మాపాప
కోయిలకేమో
పాటలు నేర్పును మాపాప
మురళికేమో
రాగం నేర్పును మాపాప
అన్నీ నేర్పించును మాపాప
మా పాపలా ఉందా మీ పాప ?
 
కామెంట్‌లు