శంకరాభరణం-(సమస్యాపూరణం)-కిలపర్తి దాలినాయుడు

 ఉ//
పండిన పంటలాకరవు
బారిని పడ్డవి; యప్పులొక్కటై
కొండను మించిపోయినవి;
కూతురు పెండ్లికి సిద్ధమై గనన్
వండిన వంటలో విషము
వైచిభుజించిన రైతుపాడిపై
పండుగనాడు బంధువులు 
వచ్చిరి గొల్లున నేడ్చిరొక్కటై !
-----------------------------------

కామెంట్‌లు