మౌనమే మిగిలిందిక.!; - ది పెన్
నా మనసు పలికే భావాలనే మాటలుగా విన్నావ్
నా కళ్లు చేసే మూగ సైగలకే నువ్ మురిసిపోయావ్

నా నోటి వెంట పదాలు‌ జాలువారకమునుపే..
నీ నోట నే చెప్పాలనుకున్న మాటలొస్తుంటే..

నా గుండె సవ్వడులను చదవగలవని మురిసిపోయా
నా మది తలపులను చూడగలవని సంబరపడిపోయా

నా మౌనానికి భాషగా మారతావనుకుని కలలుగన్నా 
నా కన్నీటిని తుడిచే తోడవుతావని ఎదురుచూశా

కానీ..కరగని శిలవవుతావని నేననుకోలేకపోయా
నిజాన్ని చూసే హృదయం లేదని తెలుసుకోలేకపోయా

నాపై నువ్ వేసిన నిందలు నా గుండెను కోసేస్తున్నా..
నీ మాటలు తూటాలై నిలువెల్లా‌ గాయాలవుతున్నా..

నీపై ఇప్పటికీ ఎందుకో నాకు కోపం రావట్లేదు..కానీ
నా తప్పులేదని చెప్పాలనున్నా మాటలు దొరకట్లేదు

నీపై గల నా నా ప్రేమలో మౌనమే మిగిలిందిక..కానీ
నువ్ లేకున్నా..ఇక రాకున్నా నీపై ప్రేమ చావదిక.!

కామెంట్‌లు
THE PEN చెప్పారు…
మొలక.. నిర్వాహకులకు కృతజ్ఞతలు.