అసలు పూజ! అచ్యుతుని రాజ్యశ్రీ

 కార్తీక మాసం అంతా పగలు ఉపవాసం  శివాలయంలో అభిషేకాలు నమక చమకంతో మారుమోగుతోంది.బైట బిచ్చగాళ్ల డబ్బాలు చిల్లరనాణాలతో ఘల్లు మంటున్నాయి."సార్  మేడం  పైసలివ్వు" అని సతాయిస్తున్నారు.శివ హరి రోజూ గుడికి వెళ్తారు.అక్కడ పనిచేసే నారాయణ మంచి మంచి అరటిపళ్ళు  పూలతో సహా అన్నీ చెత్త బుట్టలో పడేస్తాడు."ఎందుకు  అలా కొబ్బరి చిప్పలు పళ్ళు పారేయటం.భక్తులు ఎంతో ఖరీదు పెట్టి కొన్నవి.ఇలా దేవుడికి అర్పించగానే అలా వృధాగా పడేస్తావు?""బాబూ! వెంటనే శుభ్రం చేయకపోతే గుడి కమిటీ వారు  కోపం చేస్తారు" .అంతే శివ హరి మంచి మంచి పళ్ళు ఏరి తమసంచుల్లో వేశారు. కొబ్బరి చిప్పలు కూడా సేకరించారు. బైట బిచ్చగాళ్లు సోంబేరుల్లాగా కూచుని బీడీలు తాగుతుంటే బిచ్చకత్తెలు నెయిల్ పాలిష్ వేసుకుంటూ కబుర్లాడటం చూసి ఆశ్చర్య పోయారు.నారాయణ అన్నాడు "బాబూ! తెల్లారకుండానే అంతా ఊడ్చి శుభ్రం చేసే నాకు ఓపైసాకూడా ఈభక్తులు విదల్చరు.ఆబిచ్చగాళ్లకి పదులు ఇస్తారు." నిజమే అనిపించింది వారికి. కొబ్బరి కాయలు ఠపఠపా పగలగొట్టి ఆనీరంతా వృధాగా కింద పడటం చూసి  ఓగిన్నె పెట్టాడు శివా. అందులో  కొబ్బరి నీరు పోయమని అందరికీ  చెప్పాడు.ఆనీటిని తీర్ధంలాగా అందరికీ ఇస్తే  రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు ఆఅబ్బాయిలు! ఇక పుణ్యం పేరుతో ప్రతివారూ ఆవులకి అరటిపళ్ళు తినిపించటం  అవి పుర్రుపుర్రుగా పేడ వేయటం చూసి  అలా పెడ్తే ఆవులకి  జబ్బు చేస్తుంది అని వారించారు.చిత్త శుద్ధితో పూజ చేయాలి. ఓపరిమితిలో పూలు పళ్ళు ఇవ్వాలి. చెత్తలో పారేయకుండా శుభ్రం చేసి బీదా బిక్కీకి పంచారు పళ్ళు. అలాగే కొబ్బరి చిప్పలు అమ్మి ఆడబ్బుతో అనాధ ఆశ్రమం కిఅన్న దానం చేశారు 🌹
కామెంట్‌లు