నిజాయితీ! అచ్యుతుని రాజ్యశ్రీ

 టీచర్ పాఠం చెప్పి దానిమీదనే చిన్న స్లిప్ టెస్ట్ పెట్టింది.ఎవరికి తోచింది వారు రాయండి. నాపాఠం ఎంతమంది శ్రద్ధగా విన్నారో అర్థంఅవుతుంది. చిన్న ఒకటి రెండు పదాలు చాలు అనిటీచర్ చెప్పటంతో ధైర్యంగా చకచకా రాస్తున్నారు అంతా! పాఠం వినని శివా దిక్కులు చూస్తూ కూచున్నాడు. "టీచర్!నేను పాఠం సరిగ్గా వినలేదు. మాఅమ్మ కి వంట్లో బాగా లేదు. నాన్న  మా బామ్మ కి బాగా లేదని ఆమెను తీసుకుని వస్తానని ఊరికి వెళ్లాడు.లెక్కల యూనిట్ టెస్ట్ రాసి ఇంటికి పోదామని వచ్చాను"అని  నిజం చెప్పటంతో టీచర్ సంతోషించి అంది"ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా చెప్పావు శివా! కట్టుకథలతో తప్పు జవాబులు రాయకూడదు. ఆనిజాయితీ భవిష్యత్తుకి పునాది అవుతుంది. సర్ సి.వి.రామన్ ఇంటర్వ్యూ లో ఓవ్యక్తి సరిగ్గా సమాధానం ఇవ్వలేదు అని  జాబ్ ఇవ్వలేదు. ఆవిషయం చెప్పి బైటకి పంపాడు.అంతా ఐనాక రామన్ ఇంటికి వెళ్ళటానికి బైటకి రాగానే "ఇంకా ఎందుకు కూచున్నావు?నిన్ను సెలక్ట్ చేయలేదు కదా?" అని అడిగాడు. "సర్! నాకు రానుపోనూ చార్జీలు ఇచ్చారు కదా? కానీ ఓ ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చారు మీ ఆఫీసువారు. అది తిరిగి ఇచ్చివెళ్లాలని ఇంతసేపు కూచున్నాను.ఇంద మీఐదు రూపాయలు". అంతే అతని నిజాయితీ ఓపికకు మెచ్చి రామన్ అతనికి వెంటనే జాబ్ ఇచ్చారు. ఆసంస్థ అభివృద్ధికి ఆవ్యక్తి చేసిన సేవ మరువలేనిది.ఆవ్యక్తి పేరుని పేర్కొనలేదు ఎక్కడా!🌹
కామెంట్‌లు