నాకా హద్దులు.!; -: ది పెన్
నిన్నే ప్రేమించి..నీకే మనసిచ్చి..నీకై నా గుండెలో గుడికట్టిన నాకా నువ్ పెడుతున్నావ్ హద్దులు..

సూరీడు రాకముందే..నీకు చరవాణిలో సందేశం‌ పంపుతా..నీ నుంచి బదులొచ్చేవరకూ కాచుకుని కూర్చుంటా..నీ మాటతోనే రోజును మొదలేట్టే నాకా హద్దులు..

నీకు కష్టమొస్తే నాదిగా అనుకుని విలవిల్లాడతా..ఆ కష్టం నా మీదేసుకుని నిన్ను సంతోషపెడతా..నీ చిరునవ్వులోనే నా కన్నీటిని మరిచిపోయే నాకా హద్దులు..

నీ వాళ్లని, నీతో ఉన్నవాళ్లని నా వాళ్లతో సమంగానే చూస్తా..నా వాళ్లను కూడా కాదని నీకోసం ఎందాకైనా వస్తా..నీ కోసం సచ్చిపోమ్మంటే నిమిషమైనా ఆలోచించని నాకా హద్దులు..

ఎన్ని చేశానే నీ కోసం..ఎంత ఏడ్చానే నీ‌ జత కోసం..
నన్ను ఏనాడూ నమ్మని నిన్ను నా అమ్మవనుకున్నానే..
నిలువెల్లా కళ్లు చేసుకుని కంటికిరెప్పలా కాసుకుంటున్న నాకా హద్దులు..

నీ కోసం ఇంత కన్నా దిగలేను..నీపై ఎంత మనసున్నా మనిషిగా దిగజారలేను..నువ్ పెట్టిన హద్దుల్లోనే నిన్ను ప్రేమించలేను..ఈ సరిహద్దులలో ఇక‌ నేను నీతో ఇమడలేను..!

కామెంట్‌లు
THE PEN చెప్పారు…
మొలక..నిర్వాహకులకు కృతజ్ఞతలు.