శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 సంస్కృతం లో మహిషీ అంటే  పట్టపురాణి  రాజు పెద్ద భార్య!ఆమెకి అధికారాలు గౌరవం ఎక్కువ! ఆమె కొడుకు రాజ్యానికి వారసుడు అవుతాడు.మహిషి రెండో అర్ధం గేదె అని!మహిష్ అనే పదం హిందీ లో ఉంది. ప్రాకృత భాష లో మహిస్ మహిసీ ఐనాయి.మహిషి గేదె పర్యాయపదాలుగా మారాయి.బహుశ నడకను బట్టి సామానత్వం ఉందేమో?ఎదురుగా వచ్చేవారు తొలగకపోతే ధన్ మని దెబ్బలు తినటం ఖాయం! ఈభావసాదృశం కారణంగా మహిషీ అంటే గేదె  అని వాడుక లోకి వచ్చింది. మహిష్ అంటే దున్నపోతు! ఆమొహం కల్గిన దైత్యుడు మహిషాసురుడు! రంభుడు అనే రాక్షసుని కొడుకు. వాడిని సంహరించిన తల్లి మహిషాసురమర్దని.గూఢంగా చెప్పాలంటే మనలోని చెడు చెత్త ఆలోచనలు ప్రవర్తన దున్నపోతులాంటివి.వాటిని అణగదొక్కటమే దైవత్వం!పిల్లల కి మంచి నేర్పేది బాల్యం లో తల్లియే కదా🌷
కామెంట్‌లు