కుక్కలకు భయం;-- జయా
 దీపావళి సమయంలో టపాకాయలు కాల్చడం సహజమే. అయితే అప్పుడు పేలే టపాకాయలు పుట్టించే శబ్దానికి మనమొక్కసారి చలిస్తాం. ఇక కుక్కల విషయానికొస్తే ఆవి చలించే శక్తి మనంటే ఎక్కువ. మనం దీపావళి చేసుకుంటున్నామని వాటికి తెలీదు. 
 కనుక బాణాసంచా పేలడంతోనే వచ్చే ధ్వనివల్ల తమకేదో ప్రమాదమని కుక్కలు భయపడతాయి. ఎక్కడి అక్కడకు వెళ్ళి దాక్కుంటాయి. సురక్షితమైన చోటును చూసుకుంటాయి. 
 కానీ ఒక్కటి...
ఒకవేళ తరచూ ఈ బాంబు శబ్దం వింటే అవి కూడా భయపడటం మానేస్తాయి. సైన్యంలో ఉపయోగించే జాగిలాలు ఇటువంటి శబ్దాలకు అస్సలు భయపడవు. అలాగే పిడుగు శబ్దానికి కుక్కలు భయపడుతాయి్
 అయితే ఒక ప్రాంతంలో తరచూ పిడుగు శబ్దం వినిపిస్తే ఆ శబ్దానికీ అవి అలవాటుపడిపోతాయి. ఏదైనా అలవాటవడం మీదే అంటుందంతా.

కామెంట్‌లు