పద్య పఠనం కార్యశాల;-మీసాల సుధాకర్,పి.జి.టి-తెలుగు,ఖిలాషాపురం,జనగామ జిల్లా,
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్థాయి పద్యపఠనం కార్యశాలను అద్భుతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు విచ్చేసారు.పద్యం తెలుగు వారి అస్తి అని,అది మన సంసృతిని తెలుపుతుందని,ధారణా శక్తిని పెంచుతుందని తెలియజేశారు.ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు పద్య ప్రస్థానం ఎలా కొనసాగిందో వివరించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.నర్సయ్య గారు అధ్యక్షత వహించారు.ఇంకా వైస్ ప్రిన్సిపాల్ డా.కలువల శ్రీనివాస్ గారు,సదస్సు సంచాలకులు పి.శైలజ గారు,సహసంచాలకులు డా.జి.ఈశ్వర్ గారు జనగామలోని వివిధ సాహితీ,సాంకృతిక సంస్థల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శ్రీ జి. కృష్ణగారు,శ్రీ పి.సోమేశ్వరాచారి గారు,శ్రీ సోమ నర్సింహాచారి గారు,పురప్రముఖులు,ఉపాధ్యాయులు,అధ్యాపకుల విద్యార్థులు పాల్గొన్నారు.
పద్య పఠనం మీద ఉదయం,మధ్యాహ్నం జరిగిన కార్యక్రమాలకు శ్రీ పానుగంటి రామమూర్తి గారు,శ్రీ గంగరాజు శ్రీనివాసు గారు అధ్యక్షత వహించారు.సిద్దిపేట డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ ఆర్.మహేందర్ రెడ్డి గారు,పద్యపరిమళం యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు శ్రీ పి.కొండల్ రెడ్డి గారు,పద్యశ్రీ వరికోలు లక్ష్మయ్య గారు పద్య పఠనం మెలకువలను తెలియజెప్పారు.పద్యాలాపనతో ఆద్యంతం సభను రక్తి కట్టించారు.

పద్యమ్ము నెవడురా పాతి పెట్టెద నంచు వున్మాదియై ప్రేలుచున్నవాడు.
పద్యమ్ము నెవడురా పార వేయుదు నంచు వెఱ్రివాడై విర్ర వీగు వాడు.
పద్యమ్ము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్లు వేవేల నొసగు.
పద్యమ్ము నెన్నడో పాతి పెట్టితిమేము లోకుల హృదయాల లోతు లందు.

పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట.
పద్యమన్నది తెలుగింటి పాడి పంట.
పద్యమ్ము యింటింట పండు నంట.
కవిత పద్యమ్మె మీకేల కడుపు మంట.కామెంట్‌లు