ఈ కార్తిక మాసం ముప్పయి రోజులూ కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి, గంధాదులతోనూ, పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తికమాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినా, దీపదానం చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి, బియ్యప్పిండి. లేదా గోధుమపిండితో ప్రమిదను చేసి, ఆవునేతిని పోసి, ఆ వత్తిని తడిపి వెలిగించి, ఒకానొక నిద్రాహ్మణుడిని ఆహ్వానించి, చివరి రోజున వెండి ప్రమిదను, భమిడి వత్తినీ చేయించి, వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి, పూజా నివేదనాదు లను పూర్తి చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాను స్వయంగా..
🪔 :దీప మంత్రం:
సర్వజ్ఞాన ప్రదీపం
సర్వసంప చ్చుభావహం
దీపదానం ప్రదాస్యామి
శాంతిరస్తు సదా మమ ॥
"జ్ఞానం, సంపదలు, శుభాలనూ కలిగించేదైన
దీపదానాన్ని చేస్తున్నాను. దీనివల్ల నాకు నిరంతరం శాంతి సుఖాలు ఏర్పడుగాక" అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వల్ల విద్య, జ్ఞానం, ఆయుర్వృద్ధి, సర్వభోగాలూ కలుగుతాయి. మనో వాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. 🪔

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి