పసితనమా బాధ పడకు
పాపభూయిష్టమైనది ఈ లోకం
ఈ గాలి నీకు శ్వాస గా వదిగి నపుడే
నువ్వేమిటో, నువ్వెందుకో తెలియాలి!!
కానీ నీకేది ఆ తెలివి ,యేమీ తెలియని
అయోమయం,కానీ ఏం చేస్తావు,తప్పదు
నీకు ! ఆధార భూయిష్టమైన జన్మ నీది,
జన్మించడం వరమో శాపమో ప్రతి జీవికీ !!!
ఆ పైజరిగే అనునిత్య కార్యాలు
నీకే సంబంధం లేకుండా,నీకు తెలియక
సాగుసుమీ, బెంబేలెత్తక
ప్రతీదీ నీయీష్టం తో కాదు!!
తెలుసుకునే జ్ఞానం నీకేది,
నిన్ను నీవు తెలుసుకునే వరుకూ
ఈవెతుకులాట తప్పదు నీకు !!
అందరూ పసితనం బాగుంటుంది
అని అంటారు,కానీ ఏమిటో ఏమీ
ఏమీజ్ఞాపకం వుండదు, ఏమీ తెలీదు,
నిలకడ లేని చూపులు,నిర్నిమేష గమనాలు
అర్థంపర్థంలేని జరుగుబాటు ఏమిటీమాయ!!!
జ్ఞానసంపద కలుగుతుంది ముసలితనం
వచ్చాక ,అంతదనక ,ఆగక తప్పదు!!
అప్పుడు కోరుకుంటావు నీవే చిన్నతనాన్ని!!
నా పసితనమా నన్ను ప్రేమించూ, నాదగ్గరకు
రా,అని కానీ అవకాశం లేదు,అనివార్య,
జీవనం అంతులేని గమనం !!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి