తిరుప్పావై పాశురం(మార్గళి)-01;---డాక్టర్ అడిగొప్పుల సదయ్యకరీంనగర్--9963991125
"మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్

ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్"

తిరుప్పావై-ఇష్టపది-1

పాడిపంటల గొల్ల పల్లెలో వసియించు
పసిడి భూషల మెరయు పడుచులారా! రండు!
మార్గశీర్షపుశుక్ల మంచిరోజులు వచ్చె
నీరాడపోదాము నిలిపి శ్రీహరినెదలో

వాడి వేలము దాల్చి పగతురను పరిమార్చు
నందగోపుని యనుగు నందనుడు సుందరుడు
కుముదకంటి యశోద కొదమసింగము వాడు
నీలదేహపువాడు నెరుపు కన్నులవాడు

సూర్యచంద్రులబోలు చూపుల్లుగలవాడు
నారాయణుడెమనకు నారాధ్యుడై పరను
కరుణతో నిస్తాడు, పురజనులు పొగడగా
ఇది మాదు వ్రతమండి ఇచ్ఛతో చేరండి!

భూషలు=నగలు;పగతురు=శత్రువులు
వాడి వేలము= మొనదేరిన కర్ర;కుముదకంటి=పద్మాలవంటి కళ్ళుకలది
కొదుమ సింగము=బాల సింహము

తిరుప్పావై పాశురం(వైయత్తు)-02

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి

మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్!

తిరుప్పావై-ఇష్టపది-2

ధరణినుజ్జీవింప తరలివచ్చిన భాగ్య
వతులార! మన నోము పద్ధతులు వినరండి!
క్షీరాబ్ధిశాయిపద కీర్తనలు పాడుతూ
నేతి పాలను మాని, ప్రాతమే నీరాడి

నేత్రాంజనము లేక,నెత్తి కైచేయకను
వద్దన్న పనులనిల బుద్ధిగను వదిలేసి
పరుషములు,చాడీలు వరుసగా మానేసి
ఆచార్య,యాచకులు,ఆబ్రహ్మచారులును

ఆశీర్వదించేల ఆనందపరచాలి
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!

ప్రాతము= వేకువ జాము;నేత్రాంజనము=కంటి కాటుక
కైచేయుట=అలంకరించుట


తిరుప్పావై పాశురం(ఓంగి ఉలగళంద)-03

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ

పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

తిరుప్పావై-ఇష్టపది-3

ఉల్లోకముల గొలిచి నుత్తముని కీర్తిస్తు
నోము నెపమును మనము నుడివి నీరాడగా
దేశమందలి కరువు తీరి సంపద పెరుగు
మూడు వానలు కురియు మోదముగ నెలనెలకు

ఏపు వరిమళ్ళలో ఎగిరిపడు మీనములు
కలువళ్ళ తుమ్మెదలు కైపుగా నిదురించు
ఔదార్యముగ వచ్చి ఆవాసమున నిలిచి
పిదకకుండనె పాల పొదుగులను కురిపిస్తు

స్వర్ణ ఘటముల నింపు సాధు ధేనువులుండు
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!


కామెంట్‌లు