కందం:
*పుడమిని దుష్టత గల యా*
*తడు లంచంబులను బట్ట దలచుచు మిడియౌ*
*నడవడి విడి యందరి వెం*
*బడి ఁద్రిప్పికొనుచును గీడు పరుప కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద చెడు బుద్ది కల మనిషి, లంచాలను తీసుకోవడానికి అలవాటు పడిన మనిషి, మంచి దారిలో నడవకుండా, తనతో అవసరం ఉన్న వారిని తన చుట్టు తిప్పుకుంటూ, చెడు చేయడానికి కూడా వెనుకాడరు....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"కాకి లాగా కలకాలం బ్రతకడం కాదు, కోకిల లాగా కొంతకాలం బ్రతికినా చాలు" ఇది పెద్దల మాట. మనలో అతి ఎక్కవ మంది, సమాజంలో, ప్రతి నిత్యం మన కళ్ళ ఎదుట రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతూ వృద్దులు, అంధులు కనిపిస్తారు. వారికి సాయం చేయం, పట్టించుకోము. రోడ్డు మీద అనేక రకాలుగా చెత్త చెదారాలు, మరీ ముఖ్యంగా ప్రాణాంతకంగా తయారు అవగల అరటిపండు తొక్కలు పడేస్తారు. ఆఫీసులో మనతోటి వారు ఒక పని పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతుంటే వారి సహాయానికి వెళ్ళడానికి వెనుకాడతాము. ఇలా బ్రతకడం ఒక బ్రతుకు కాదు. మనమందరం ఈ విధంగా కాకుండా కొంచమైనా సామాజిక స్పృహ కలిగిన వారిగా ఉండవలసిన అవసరం, అగత్యం తప్పకుండా ఉంది. ఇలా నలుగురు గురించి ఆలోచించి, వారికి సహాయపడుతూ, మన చుట్టూ జరుగుతున్న కొన్ని అవలక్షణాలకు అయినా గొంతెత్తి మాట్లాడ గలిగేలా బ్రతికే అవకాశం పరమాత్ముడు మనకు కలిగించాలని.......... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి