కందం:
*ఏనాడైనను వినయము*
*మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ*
*బూనకు మసమ్మతయి బహు*
*మానమునను బొందు మిదియె మతము కుమారా !*
తా:
కుమారా! ఎటువంటి పరిస్థితులలో అయిన ఒదిగి ఉండటం, వినయంగా ఉండటం అనే లక్షణాన్ని వదిలి పెట్టకూడదు. రాజులతో, నీ పై అధికారులు చెప్పిన విధంగా కాకుండా వ్యతిరేకంగా, భిన్నంగా పనిచేయడం మాను కోవాలి. ఇలా నడచుకోవడమే సరైన పద్ధతి....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*సీతమ్మను రావణ చెర నుండి విముక్తను చేసి, అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేస్తున్న సమయంలో సీతను అడవిలో దింపి రమ్మనమని లక్షణునికి రాముడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ పనిని తాను చేయలేను అని తెలిసినా, పని చెయ్యమన్నది, తన అన్న రామభద్రుడు, పైగా రాజు. తన ఆలోచనలను పక్కన పెట్టి, రాజాజ్ఞ పాటించాడు లక్ష్మణుడు. రాజ్యం పట్ల, అన్న గారి పట్ల తన విధేయతను కనబరిచాడు. మనం కూడా ఇప్పటి కాలమాన పరిస్థితుల ను బట్టి, ఆఫీసులో పై అధికారి చెప్పిన పని రూల్స్ కి వ్యతిరేకం కానంతవరకు పాటించడమే మన ధర్మం. మనం పని చేసే చోట అధర్మం జరుగుతున్నప్పుడు, కార్యాలయానికి తెలియ జేయ వలసిన ధర్మం కూడా మనదే. ఇలా విజ్ఞతతో నడుచుకునే సదవకాశాన్ని పరమేశ్వరుడు మనకు కలుగజేయాలి అని....... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి