మా పల్లె;- సి.హెచ్.అలేఖ్యా రెడ్డి. 10.తరగతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇందిరా నగర్--సిధ్ధిపేట.

 చక్కని పంట పొలాలతో మా పల్లె పచ్చని సువాసన విరజిల్లే 
రంగు పూలతో మా పల్లె అందంతో సొగసిల్లే 
పచ్చని రంగులతో ఆ చెట్లు 
మా ప్రాణవాయువుకు జీవనమెట్లు  పుల్లటి రుచితో ఆ చింత చిగురుని తింటే పులకింత 
నీలపు రంగుతో ఆ చెరువు పశుపక్షాదులకు ఆదేరువు 
తుమ్మ చెట్టుకు వెళ్లాడే ఆ గూళ్ళు మానవులకు ఎవరికీ సాధ్యం కాని చిక్కుముల్లు
వరసల అనుబంధాలతో మా పల్లె అందాల హరివిల్లయి విలసిల్లె.
             
కామెంట్‌లు