తిరుప్పావై – 10వ పాశురము; - సి. మురళీమోహన్
 శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో 🌹
10వ పాశురము :-
(శ్రీమతే రామానుజాయనమః)
(24/12/22)
నోత్తు చ్చువర్‍క్కమ్ పుహిగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి_ నారాయణన్; – నమ్మాల్
పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్; పణ్డొరునాళ్,
కూత్తత్తిన్ వాయ్ వీళ్‍న్ద కుమ్బకరణనుమ్
తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆత్త అనన్దలుడైయాయ్! అరుఙ్గలమే!
తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
మేము రాకముందే నోము నోచి దాని ఫలముగ సుఖానుభవమును పొందిన తల్లీ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాటనైనను పలుకవా! పరిమళములతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడిననూ పఱ అను పురుషార్థమును ఒసంగెడి పుణ్యమూర్తి, ఒకనాడు కుంభకర్ణుని మృత్యువునోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఒసంగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ! మాకందరకు శిరోభూషణమైనదానా! నిద్రనుండిలేచి మైకము వదలించుకొని, తేరుకుని వచ్చి తలుపు తెఱువుము, నీ నోరుతెరచి మాటాడుము, ఆవరణము తొలగించి నీ దర్శనమునిమ్ము.
(ఆణ్డాళ్‌ దివ్యతిరువడిగళే శరణమ్)
🌹🙏🌹

కామెంట్‌లు