తిరుప్పావై పాశురం-11;-డాక్టర్ అడిగొప్పుల సదయ్యజమ్మికుంట, కరీంనగర్9963991125
కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు
శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
కుత్త మొన్ఱిల్లాద కోవలర్ దమ్ పొఱ్కొడియే
పుత్తరవల్గుల్ పునమయిలే పోదరాయ్

శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వన్దుమ్ నిన్
ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి , నీ
ఎత్తుక్కురుంగుమ్ పొరుళేలోరెమ్బావాయ్

తిరుప్పావై ఇష్టపది-11

సంతు గలిగిన మిగుల సాధు గోమందలను
పరగ పెంచుతు పాలు కురియ పిదికెడివారు
దండెత్తి పోరాడి దాయలణచెడివారు
తప్పు చేయనివారు గొప్ప గొల్లలు వారు

అట్టి కులమున వెలుగు అగ్నిరజ వల్లరీ!
కులకాహి నితంబిని! పొల మయూరమ! రావె!
బంధు మిత్రువులెల్ల వచ్చి నీ ముంగిటను
మేఘవర్ణుని నామ మెంతయో కీర్తించ

ఉలుకవే! పలకవే! ఉరు నిధులు కలదాన!
నీ యెత్తుగడ యేమి? నెరజాన! న్యాయమా?
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!

సంతు = సంతానము;మిగుల = చాల
దాయలు=శత్రువులు;అగ్నిరజము=బంగారము
వల్లరి =తీగ;అగ్నిరజ వల్లరీ= బంగారు తీగా!
కులక + అహి నితంబిని= పుట్టలోని పాము లాంటి పిరుదులు కలదానా!
పొల మయూరమా = వన మయూరమాకామెంట్‌లు