తిరుప్పావై ~ 12 వ పాశురము ; - సి. మురళీమోహన్
 (శ్రీమతే రామానుజాయనమః)
కనైతిళగ త్తెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రు పాల్ శోర
ననైత్తిల్లమ్ శేరాక్కుమ్ నర్చెల్వన్తంగాయ్
పనిత్తిలై వీళ నిన్ వాశల్ కడైపత్తి
చ్చినత్తినాళ్ తెన్నిలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై పాడవుమ్ నీవాయ్  తిరవాయ్
ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరురక్కమ్
అనైత్తిల్లత్తారు మరిన్దేలో రెంబావాయ్!
 
ప్రతిపదార్థాలు:
 
కనైత్తు ఇళం కత్తెరుమై కన్రుక్కు - అరచి లేత ఆవు 
దూడలపై;
ఇరంగి నినైత్తు ములై
వళియే - జాలి గొని ఆవుల పొదుగుల ద్వారా;
నిన్రు పాల్ శోర 
ఎడతెగక పాలు కురిపించగా;
ననైత్తు ఇల్లం 
 ఇల్లు నాని నేల అంతా;
శేర్ ఆక్కుం  బురద అగుచున్నది;
నగర్ శెల్వన్ తంగాయ్  ఉత్తమమగు ఐశ్వర్యము గలవాని యొక్క చెల్లెలా!;
పని త్తలై 
మంచు తలపై;
వీళ నిన్ వాశల్ కడై
పట్రి
పడగా నీ వాకిలి కడ పట్టి;
శినత్తినాళ్
 కోపముతో;
తెన్ ఇలంగై కోమానై
 దక్షిణ లంకాధిపతిని;
చ్చెత్త
చంపిన;
మనత్తుక్కు ఇనియానైమనస్సుకు ఆహ్లాదకరుడైన రాముని;
పాడవుం
 పాడుతుండగా(కీర్తించుచుండగా);
నీ వాయ్  తిరవాయ్  నీవు  నోరు తెరువవు;
ఇనిత్తాన్ ఎళుందిరాయ్~~ ఇప్పటికైనా లేచి
రమ్ము;
ఈదెన్న పేరు ఉరక్కం~~ ఇది ఏమి గాడ నిద్ర 
అని;
అనైత్తు ఇల్లత్తారుం
ఇన్ని ఇండ్లవారునూ;
అరిందు ఏలోరెంబా వాయ్ 
 విస్తు పోతున్నారు.
 
భావము:
                      ఓసీ భాగ్యవంతురాలా! 
నీ సంపత్సమృద్ది ఏమని 
చెప్పుదుము? లేదూడలు 
ఆకలిగొన్నవాని వానిపై
దయగలిగి అంబాఅని 
పిలుచుచూ, వాని తల్లి 
ఆవులు తమ దూడలను తలపోయుటచేత పొదుగులోని 
చన్నులు పాలు చేపునకు వచ్చి ఎడతెగక 
స్రవించుటచే, ముంగిట అంతా బురద 
అయ్యింది. అంతటి సంపన్నురాలగు నీ ఇంటి ముంగిట బురద నేలపై 
నిలిచి తలలపై మంచు 
కురియుచుండ తడియుచున్నాము. ఊరక నిలుచుట కాదు. దేవతా కార్యార్థమై హరి 
విభవావతారుడుగా 
అవతరించినాడు. తన 
ఇల్లాలిని హరించినవాడను నెపముతో 
సముద్రమున సేతువును 
కట్టి సైన్యసమేతంగా సాగరమును దాటినాడు. లంకలో ప్రవేశించి దాని 
అధినాథుడైన రావణుని హతమార్చి తాపసుల 
మనస్సులను ఆనంద
పరచినాడు. అట్టి 
శ్రీరామచంద్రమూర్తిని
 కీర్తించుచూ ‌నీ వాకిలి ముంగిట 
నిలిచి  వున్నాము.మేము వచ్చి 
నీకై నిలిచివుండుట 
చూచియూ, రామ కీర్తనమును 
వినియూ లేచి రాక ఇంకా
పరుండి యున్నావు. 
ఇదేమి నిద్రపోతుతనమే 
తల్లీ నీది?
లేచి రావమ్మా ~ ఇకనైనా నిద్ర చాలించి లేచిరావే!
 
వ్యాఖ్య: 
          గుంజలకు బంధింపబడిన లేగదూడలను తలచి తలచి తల్లులు
ఇవి ఆకలితో అలమటించు చున్నవే అని తలుగులను తెగతెంచుకుని తమ కడకు వచ్చు శక్తి చాలనివే అని వానిమీద కరుణ కలిగి తద్భావనచే 
అవిచ్చిన్నముగా పాలు 
చేపునకు వచ్చి కొడుకులవెంట ఏకధారగా స్రవించునట్లు ~ 
పరమాత్మ ప్రకృతి వ్యామోహమున బడి ఆ బంధనము నుండీ తప్పించుకుని తనదగ్గరకు రాలేని సంసారసాగరమున మునిగి అటమటించు జీవకోటిని చూచి
వానికి ఉపకరింపదలచి కరుణతో వలసిన ఉపకారమంతయూ చేయుచున్నాడు!
  
అనువాద సీస పద్యం:
 
ఆకొన్నలేగల నాదరమ్మున బిల్చి
ఎనుములు తచ్చింత మనము గరిగి
పాల్ చేపి చన్నులబడి జాలువారి యి
ల్లెల్ల జంబాలమై యుల్లసిల్లు
ధ‌‌న్యురాలా! మంచు తలలపై గురియంగ
దడియుచు నీ యింటి గడప పట్టి
సీతను చెరగొన్న యాతుధానుని లంక
నేతను కాలుని వాత ద్రోసి
సాధుమానస మానంద జలధిదేల్చి
నట్టి శ్రీరామచంద్రు నోరార బాడి
నప్పటికి మారుమాటాడ; వందరెరిగి
నార లింకేని లెమ్మ! బంగారు బొమ్మ!
(ఆణ్డాళ్ తిరువడి గళే శరణమ్)

కామెంట్‌లు