భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 18వ జాతీయ జంబోరికి వావిలాల స్కౌట్ లు.

 రాజస్థాన్ లోని పాలీలో తేది: 04-01-2023 నుండి 10-01-2023 వరకు జరిగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్: 18 వ జాతీయ జంబోరీకి జి.ప.ఉ.పా.వావిలాలకు చెందిన ఇద్దరు స్కౌట్లు ఐ శ్రీ చరణ్ మరియు బి రాకేష్ ఎంపికైనట్లు జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ శ్రీ అడిగొప్పుల సదయ్య తెలియజేశారు.సుమారు 30,000 వేల మంది స్కౌట్లు మరియు గైడ్లు పాల్గొనే ఈ జంబోరీని తేది: 04-01-2023 న రాజస్థాన్ లోని పాలీలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.ఈ జంబోరికి జిల్లా నుండి 43 మంది స్కౌట్స్, గైడ్స్ ఎంపికయ్యారని,వారంతా జంబోరీలో "తెలంగాణా రాష్ట్ర సంస్కృతిని,ఔన్నత్యాన్ని తెలిపే సంఘటనలను ప్రదర్శించడంతో పాటు స్కౌటింగ్ నైపుణ్యాలైన పయనీరింగ్ ,ఎస్టిమేషన్,ఫస్ట్ ఎయిడ్ ,సిగ్నలింగ్ ,క్యాంప్ క్రాఫ్ట్ ,అడ్వెంచర్ పోటీలలో ఇతర రాష్ట్ర విద్యార్థులతో పోటీపడతారు.ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కెపి నరేందర్ రావు,జిల్లా కార్యదర్శి శ్రీ కంకణాల రాంరెడ్డి,ట్రైనింగ్ కమీషనర్ శ్రీ షరీఫ్ అహ్మద్, ఉపాధ్యాయులు అభినందిం


చారు.

కామెంట్‌లు