కలల ప్రపంచం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
చీకటి ఆకాశంలో
బుడ్డి దీపం కొనప్రాణంతో
కొట్టుమిట్టాడుతుంది....
రెక్కలు ముక్కలైన
డొక్కలు నిండని
దుస్థితి పాపం...
ఆకలి కేకల 
రాగాల మధ్య
ఆ శబరీ క్షేత్రంలో 
కన్నీటి
కచ్చెరి ఇప్పుడే మొదలైంది...
సత్తు పోయిన విస్తరి
అన్నం వడ్డించగానే  పెద్దదయినట్లు
అనిపిస్తుంది....
చద్ది ముద్ద అరచేత
నిలపగానే 
పేగు బంధం భాగానికి
చేయి చాచింది...
వికృత సన్నివేశాల 
నడుమ చిత్రించిన 
కథనాలను చూసి
కన్నీరైన చందమామ 
వెన్నెల వర్షం కురిపించింది...
కాసంత కునుకు తీరుతాడని
నేలమ్మా ఒడిని పరిచింది...
ఒంటరితన్నాన్ని తరిమిన చిరుగాలి చిత్రంగా చెవిలో ఊసులు చెప్పింది...
జవాబు దొరకని ప్రశ్నల
ఉత్తరాలను కుప్పగా పోగేసి కాల్చేసిన తర్వాత
వాస్తవాల ఆదమరపునా
అందమైన కలల ప్రపంచం అతన్ని ఆహ్వానించింది...  కామెంట్‌లు