పద్మ శ్రీ బందా గారు (9);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఉషశ్రీ గారు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత  వారి తమ్ముడు  పురాణపండ రంగనాథ్  శాస్త్రీయ పరిశోధనలతో కూడిన నాటకాలు రాసి పంపడం మొదలుపెట్టాడు వారు రాసిన నాటకాల్లో నాకు బాగా నచ్చింది బాహుబలి  దానిని ఎన్నిక చేసి బాహుబలి పాత్రను నేనే నిర్వహించి  రికార్డ్ చేస్తున్న సమయంలో రంగనాథ్ స్టూడియోలోకి వచ్చి  కూర్చున్నాడు. ఎన్నో నాటకాలు రాసి మంచి పేరు సంపాదించిన రంగనాథ్  మొదటిసారి  నాటకం రికార్డింగ్ పూర్తికాగానే  స్టూడియోలోపలకు వచ్చి నన్ను కౌగిలించుకొని  కన్నీరు తెప్పించారు సార్ రచయితను నేనైనా ఆ క్షణాన ఆపుకోలేకపోయాను  నాటకాన్ని బ్రతికించారు సార్  అని అభినందించారు.
తర్వాత సి.వి సూర్యనారాయణ గారికి  ఆ నాటకం బాగా నచ్చి  బాహుబలిని ఎన్నుకొని  అద్భుతంగా  నిర్వహించి  ఆ పాత్రను కొత్త కోణంలో చూపించడానికి ప్రయత్నం చేసి కృతకృత్యుడయ్యారు. దానిలో కూడా నేనే బాహుబలి. దానితో రంగనాథ్ పొంగిపోయాడు రచయితగా  తర్వాత భారత దేశంలో ఏ కేంద్రంలోనూ జరగని గొప్ప విశేషం విజయవాడలోనే జరిగింది  ఎవరికైనా ఒక మేధావిని చూసినప్పుడు మిగిలిన మేధవులకు అసూయ ద్వేషాలు ఏర్పడడం సహజం. కానీ మా కేంద్రానికి కీర్తిని తెచ్చిన అనేక నాటకాలను రాసి నిర్వహించి పాత్రలను  పోషించిన రామం అనబడే ఎస్.బి శ్రీరామమూర్తి అనేక బహుమతులను  తీసుకువచ్చాడు. దానిని ఆధారం చేసుకుని మరో తమ్ముడు  జయ ప్రకాష్  ఆ నాటకాల మూలాలకు వెళ్లి ఆ విషయాన్ని గురించి పీహెచ్డీ  చేసి డాక్టరేట్ సంపాదించారు  అది మా ఎనౌన్సర్స్  జాతికే  అద్భుతమైన వరం ఈ క్షణం వరకు కూడా ఏ కేంద్రం వారు  అలాంటి పని చేసిన దాఖలాలు లేవు  నాటకాలలో అంత పేరు ప్రఖ్యాతులు రావడానికి  ప్రతి ఒక్కరూ సహకరించారని చెప్పాలి.
బందా కనక లింగేశ్వర రావు గారి పేరు బందాగా స్థిరపడడానికి ప్రత్యేక కారణం ఒకటి ఉంది  ఆయన రేడియోలో ప్రయోక్తగా చేరిన తరువాత  వారు నిర్వహించే నాటకాలకు  నిర్వహణ తన పేరు చెప్పమని  ఆకాశవాణి విజయవాడ కేంద్ర నాటక ప్రయోక్త  బందా కనక లింగేశ్వర రావు గారు అని చెప్పాలి అని కోరుకునేవారు. నేను రావడానికి ముందు గుర్రం కోటేశ్వరరావు గారని అనౌన్సర్ గా పనిచేశారు ఆయన ఒకరోజు నాటకాన్ని ప్రసారం చేసే డ్యూటీ తాను బందాగారి దగ్గరికి వెళ్లి మీ పేరు చాలా బరువుగా ఉంది అంత పేరు నేను పలకలేను నేను అసలే దళితుణ్ణి నేను చదివిన బిఎల్ చూసి ఉద్యోగం ఇచ్చారు తప్ప  నా కంఠాన్ని చూసి ఇవ్వలేదు నేను దానిని పూర్తిగా చదవటం కష్టం. దయచేసి ఆ పేరును కొంచెం కుదించండి అని కోరారు.


కామెంట్‌లు