ఎదురుచూచి ఎదురుచూచి
ఎద మరుగున దాగిన నీదు తలపులు
తరగని తెంపెరలు, కనులు నిండి
జాలువార టపటపల విన్యాసం
ఎరుగని మనసు వాన జల్లులు
కురిపించింది కన్నీరు లా!!
బ్రతుకు శూన్యంలో వెతుకుతోంది
బరువుగా సాగు జీవనం ఆ
ఆ శూన్యంలో పుట్టిన నీ ఆలోచనలు
నిలదీస్తున్నాయి నిజాన్ని!!
ఎలా తమాయించుకుంటుంది ఈ
నిజాన్ని హృదయం, ఎరుగ లేక
బాదు తోంది లోలోన ఆశబ్ధతరంగాలు
తరుముతున్నాయి, నా మనసులోని
ఆశలు నీ దరికి ఎక్కడో శూన్యంలోకి!!
ఆశగా ఎదురుచూసే జీవితాలకి
అవరోధపు విద్యుత్ ఘాయాలే!
కన్నీటి కడలి మధ్య ఊహలలో
చిక్కుకున్న నన్ను తలచు నువ్వెక్కడ,?
మిత్రమా! జాగు చేయక రాగదయ్యా,
కొన ఊపిరి తీసుకొను సమయాన
జాలి చూపవా రావా,!!!
=============================
ఎదురు చూపు;- కొప్పరపు తాయారు;- సెల్ ; 9440460797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి