సారధి;- కొప్పరపు తాయారు ;-సెల్;:9440460797

          సారధినవుతాను ప్రతీ మంచి పలుకుకీ
           గానమవుతాను. ప్రతీ  ప్రేమ గీతానికి

           ఆధారమవుతాను ప్రతీ అవసరానికి
           కడవరకు నిలుస్తాను ప్రతీ భావనకీ
  
           మనసునే అవుతాను ప్రతీ సద్భావనకీ
          మహనీయమవుతాను ప్రతీ మంచి చేతకీ

          మహిత నవ్వుతాను  ప్రతీ  మంచి సద్వాక్కుకీ
          గణనీయమవుతాను ప్రతీ ఊహకీ

          మనిషిగా నిలుస్తాను మనుగడకీ
          బ్రతకడం నేర్పుతాను బడుగు జీవులకీ

         కల కల రావాలా కమనీయమవుతాను గళంకీ
         కలమే అవుతాను కవితా వాహినికీ

        కారణమవుతాను ఉన్నతత్వానికీ
        కాలమే అవుతాను ఆగని పయనానికీ!!
 
           
   


కామెంట్‌లు