అర్థం కాని ప్రశ్న;- కొప్పరపు తాయారు;-సెల్ ; 9440460797
        నవ్వాలనే ఉంది మనసులో కోరిక
         మది భారం అవుతోంది తప్పు ఎవరిదో
         తెలియక, తరాల అంతరాల నడుమ
         నలుగుతున్న అహం ఏమైంది??

         రసగుళికలా మింగలేను అదేమిటో!
         రమ్యతతో చూడలేను రసవత్తరంగా!
         నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని
         ఏవేవో ఆశలు అవి పొందలేనివి!!

         జుగుప్సతో,గుండె పగిలిపోతుంది,
         ఏమిటీ అర్థం లేని అనవసరమైన బాధ!
         నేస్తాలు లేరు, బంధువులు లేరు,
         ఎవ్వరూ లేరు కానీ విన్నవించుకోవాలి!!

         ఎవరికీ! ఎలా! పట్టు తప్పని ప్రశ్న!   
         పదిలంగా మనసులో జ్వాలలు మండించే
         మహా మహిమ కలిగిన తృష్ణ!.  
        నమ్మకం ద్రోహమా! మంచితనం శాపమా !

        అందరికీ మేలు కోరడం అపరాధమా
         ఏది తప్పు?
        ఆశ లేని జీవికి అనావశ్యపు బాధలు
        కోరికలే లేని మనిషికి, పనికిరాని కోతలు
        నిశబ్ద జీవికి  నిరవధికగా భజంత్రీలు,
        ఏమిటీ  విశేషం, విశ్వసనీయం కాదా!!!

  


కామెంట్‌లు