ఋషి సంప్రదాయం;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడం కోసం  జ్ఞానులు తపస్ సమాధికి వెళతారు  మొదట మునిగా ప్రారంభిస్తారు  భౌతిక వాంఛలకు దూరంగా తాను దేనిని నమ్మి  దానిని దర్శించుకుందామనుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చేస్తారు  ఆ స్థితి నుంచి  ఋషి అంటే చరించేవాడు  భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తూచా తప్పకుండా వేద విహితమైన జీవితాన్ని  గడిపే వ్యక్తి  వారు నిత్యం  తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నా మనసు మాత్రం  భగవత్ స్వరూప దర్శనం కోసం  ప్రయత్నం చేస్తూ దాని మీదే కేంద్రీకరించి ఉంటుంది  మిగిలిన విషయాల జోలికి వారి మనసు వెళ్లదు  అరిషడ్వర్గాలను జయించిన వ్యక్తి గనుక  ఈ ప్రపంచంలో ప్రతివారికి ఆదర్శప్రాయంగా ఉంటారు. ఉదాహరణకు  వీరబ్రహ్మేంద్రస్వామి లాంటివారు  తన మనసును అధీనంలో ఉంచుకొని కనులు మూసి  భవిష్యత్తును చూడగలిగిన ధన్యాత్ములు  అలాంటివారు  ఏ సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో  దానిని పూసగుచ్చినట్టు చెప్పగలిగిన  శక్తి వారికి ఉంటుంది  ఫలానా విషయం ఇలా జరుగుతుంది  అని వారు చెప్పిన తరువాత ఆ క్షణానికి అది జరిగి తీరవలసినదే  కొంతమంది కి అనుమానం రావచ్చు  నిజంగా అక్కడ జరుగుతున్న దానిని చూసి  భవిష్యత్తును చెప్పగలుగుతున్నారా  లేక వాక్సుద్ధితో  వీరు చెప్పినట్లుగా అప్పుడు అలా జరిగి తీరుతుందా ఈ మీమాంస తేలేది కాదు  అనుభవించిన వారికి మాత్రమే  దాని లోతుపాట్లు తెలుస్తాయి తప్ప  ఆకతాయితనంగా ఆలోచించే వారికి ఆ స్థితి రాదు.
వేమన కూడా  అలా భవిష్యత్తుని దర్శించినవాడే. తను దర్శించిన వారి యొక్క మాటలు  నమ్మలేని వాడు  తెలివి తక్కువ వారు అని నిర్ణయించారు. ఋషి ధర్మాన్ని అనుసరించమని మన పెద్దలు చెబుతూ ఉంటారు  అంటే శాస్త్రీయంగా చేయవలసిన పనులను మాత్రమే వారు చేస్తూ ఉంటాడు కనుక  వారు ఏది చేసినా  శిరోధార్యమే కనుక  దానిని అనుసరించమని పెద్దలు చెబుతారు  అలాంటి ఋషులు శిష్యులను పోగు చేసి వారికి పాఠాలు చెప్పినట్లుగా విషయాలను చెప్పరు.  వారు దేనిని అనుసరిస్తూ ఉంటారో  దానిని చూసి  శిష్యులు దానిని అనుసరిస్తూ ఉంటారు తప్ప  ఇలాగే ఎందుకు చేయాలి  ఇప్పుడు మేం చేసినట్లు చేయకూడదా అని  ప్రశ్నించేవారు ఆ రోజులలో  గురుకులాలలో కనిపించలేదు  కనిపించరు కూడా  మరి ఆ పద్యం చదవండి.

"ఋషులెరుంగ నట్టి విషయంబు భువి లేదు 
వారు సెప్పినంత వరుస నగును  
తెలియకనెడి వారు దేబెలు నిజమయా..."


కామెంట్‌లు