గురు స్థితి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈ ప్రపంచంలో వ్యాపార వస్తువులుగా చలామణి అవుతున్నవి రెండే రెండు  ఒకటి విద్య రెండు వ్యభిచారం. ఒకటవ తరగతి నుంచి పీహెచ్డీ వరకు  పాఠశాలలో చదవాలంటే  వందలతో ప్రారంభమై లక్షలతో అంతమవుతుంది.  ప్రత్యేకించి వైద్య వృత్తికి వెళ్లాలంటే దాదాపు కోటి రూపాయల వరకు  వారికి చందా రూపంలో ఇవ్వవలసి వస్తుంది. మనం నేర్చుకునే విద్య  స్థితిని బట్టి వాటి ధరలు మారుతూ ఉంటాయి  అలాగే తన శరీరాన్ని  వ్యాపార వస్తువుగా మార్చుకున్న స్త్రీ  ఆమె వ్యక్తిగత పరిస్థితులు ఏమైనా కావచ్చు  ఒక చిన్న గది అద్దెకు తీసుకొని  వేలకు వేలు  సంపాదించగలుగుతున్న  ది అంటే  సమాజం ఏ స్థితికి దిగజారిందో మనం ఊహించుకోవచ్చు  గురుకులాల నుంచి నేటి వరకు  ప్రతి విషయాన్ని మనం గమనించినట్లయితే  విషయం తేటతెల్లమవుతుంది.
గురుకులాలలో  మన పాఠశాలలో జరిగినట్టుగా ఒక ఉపాధ్యాయుడు వచ్చి వాళ్ళకు పాఠాలు చెప్పడం దాని గురించి ప్రశ్నలు అడగడం ఉండదు  ఒక విద్యార్థి  ఆచార వ్యవహారాలలో కానీ  జీవిత పద్ధతులను అనుసరించడంలో కానీ ఋషి మార్గాన్ని అనుసరిస్తారు  మనసు విప్పి ప్రతి అక్షరం లో ఉన్న క్షరం కాని  వేదాంతార్థాలతో కూడిన విషయాలను అన్నిటిని ఆ వయసు పిల్లలకు అర్థం అయ్యేలా  ఉపాధ్యాయుని లాగా  (ఉప అంటే  ప్రక్కనే  తనకు అతి సమీపంలో కూర్చోబెట్టుకొని) అధ్యయనం చేయించడం. గురువుగారు ఏది చెబితే  దానిని శిష్యుడు  గురువుగారు చెప్పిన పద్ధతిలో చెప్పాలి  దీనిని ఆర్ష ధర్మము అంటారు  భారతీయుడు అంటేనే ఆర్ష ధర్మాన్ని అనుసరించేవాడు  వెలుగును చూసేవాడు, చూపేవాడు అని అర్థం.
గురువుగారి  దృష్టి  కుర్రవాడిని  ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడం  దానికి కావలసిన పద్ధతిలో  ఆధ్యాత్మిక స్థితిని కూడా తెలియజేస్తూ  పరిణతి చెందిన వ్యక్తిగా బయటకు పంపిస్తారు  అలాంటి గురువు గారికి  అతి తక్కువ ఖర్చుతో వచ్చే పుచ్చకాయ కూర కూడా ఇవ్వని వ్యక్తి  ఒక వేశ్య వలలో పడి  ఆమె ఎంత అడిగితే అంత  ఏ విలాస వస్తువులు కావాలంటే వాటిని  ఇస్తూ ఆమె మెప్పును పొందాలని ప్రయత్నం చేస్తాడు  ఈ రెంటినీ సమన్వయపరుస్తూ వేమన చెప్పిన  అద్భుతమైన వాక్యం  గురువు అంటే భగవానునితో సమానమైన వాడు  వేశ్య కన్నాగుణము లేనివాడా? జీవితాన్ని నిలబెట్టిన వారిని  మర్చిపోయి జీవితాన్ని నాశనం చేసే వేశ్యలను  నమ్మి సర్వం నాశనం కావటం అది తన స్వయంకృతాపరాధం  దానిని చెప్పడం కోసమే ఈ ఆటగడది  మీరు చదవండి.

"గురువునకును పుచ్చ కూరైన నీయరు అరయ వేశ్యకిత్తు రర్ధమెల్ల గురుడు వేశ్య కన్న గుణహీనుడేమొకో"


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం