సామ్రాట్ పృథివీ రాజ్ చౌహాన్;-శంకరప్రియ., శీల.,--సంచారవాణి: 99127 67098
 👌శబ్దభేది నిపుణుడు
అమర దేశభక్తుడు
     పృథ్వి రాజు శ్రేష్ఠుడు!
ఆత్మ బంధువులార! (1)
👌నిర్దోషియు, వీరుడు!
క్షమాగుణ వంతుడు!  
      సామ్రాట్ పృథివీ రాజ్!
ఆత్మ బంధువు లార!
👌పృథ్వి రాజు.. ఆజ్మీరు పరి పాలకుడు! శబ్దభేది విద్యలో సర్వ సమర్థుడు! భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన వీరుడు! 1177 నుండి పృథ్వి రాజు కాలంగా చారిత్రక ఆధారము లున్నాయి! 
 👌సామ్రాట్ పృథివీ రాజ్ చౌహాన్..  ఎన్నో మార్లు దండెత్తి వచ్చిన; విదేశీయుడు మహ్మద్ ఘోరీని ఓడించాడు! తరువాత, క్షమాభిక్షగా
దుర్మార్గుడైన ఘోరీని విడిచి పెడతాడు! చివరకు, ఒకసారి దోపిడీగాడైన ఘోరీకి చిక్కి; కన్నులు కోల్పోయాడు, సామ్రాట్ పృథివీ రాజు!  నిష్కళంక దేశభక్తుడు! జాతీయ మానవతావాది!
       🚩ఉత్పల మాల
            ద్వేషము తోడ ఘోరి తన
దేశము మీదకు మాటిమాటికిన్
           దూషణ సేయుచున్ బడుచు,దోపిడి గాడయి, చేత జిక్కినన్
            శ్రేష్ఠుడు పృధ్విరాజు  కృప 
జిల్కెను ; కన్నుల గోలుపోయెనే !
            "దోషము లేక యుండుటయె, దోషమటంచు వచింత్రు పండితుల్" !
( సమస్యా పూరణ కావించిన వారు: జంధ్యాల జయ శంకర బాపూజీ.,)

కామెంట్‌లు