జీవిత రహదారిలో
ఎన్నెన్నో మలుపులు..
మలుపుకో మార్పు
మజిలీకి ఒక జ్ఞాపకం.
కొండంత సంతోషాన్ని
మనసుకు తెచ్చినవి
కొన్ని....
మరపు రాని గాయాలు
చేసేవి కొన్ని...
మనసుకు హత్తుకొనేవి
మదిలో తిష్ట వేసేవి.....కొన్ని
మనకే తెలియని
మనల్ని మనకు
పరిచయం చేసేవీ..
మరికొన్ని
అంతరంగం అనుభవించేదీ
మనకు మాత్రమే తెలిసేవి కొన్ని
ఎన్నో రత్నాలు......రాళ్ళూ
లాటి జ్ఞాపకాలు.
మౌనంగా వేధించేవి
తలచుకుంటే కంటతడి ఊరేవి
అర్థం కానివి అర్థం లేనివీ
అనుబంధాలు....మమతలూ
తలపుల కెరటాలు
గుండెలోతుల్లోంచీ
ఒడ్డుకు తెచ్చి గుర్తుచేసే
అమూల్యమైన అనుభవాలు
జీవితంలో మరుగున పడ్డ
జ్ఞాపకాల గని నుండీ
ఒడ్డుకు వచ్చిన రత్నం లాటి
తలపులతో హాయిగా సాగే
అద్భుతమైన ఉదయాన్ని
ఆనందంగా స్వాగతిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి