పాపాయి!!(బాలగేయం);--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

 వడివడిగా  నడిచింది
పడిపడి  లేచింది
ఒడిలోని పాపాయి
గుడిలోకి వెళ్ళింది
సడిచేస్తూ బుజ్జాయి
బడిలోకి పోయింది
తడబడుతూ గురువుకు
దండాలు పెట్టింది
మడిలోని పైరులా
నడిరేయిజాములా
కడిగిన ముత్యమే!!
నడుస్తున్న పాపాయి!!

కామెంట్‌లు