వెలుగు దివ్వె! అచ్యుతుని రాజ్యశ్రీ

 గేమ్స్ పీరియడ్ లో పిల్లలంతా గ్రౌండ్ కిఫరుగులు తీస్తే శివా మూత్రం కాలునెప్పి అని వంకపెట్టి క్లాస్ లో లెక్కల హోంవర్క్ చేస్తున్నాడు.కొత్త ఏడాది హడావిడి లో మర్చిపోయాడు. సార్ చాలా స్ట్రిక్ట్. క్లాస్ టీచర్ గమనించి  శివా ని అడిగితే వాడు నిజం చెప్పాడు."అరే!ఇవాళ హాకీ ఆటని నేర్పుతున్నారు పి.టి.సార్!" అని అనటంతో వర్క్ పూర్తిచేసి పరుగులు పెట్టాడు. పి.టి.సార్ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ని గూర్చి చెప్పసాగారు"1905లో ప్రయాగరాజ్ లో పుట్టిన ధ్యాన్చంద్ తన 16వ ఏటనే ఒలింపిక్సు లోఎక్కువ గోల్స్ చేసి బంగారు పతకాలు సాధించాడు. ఆయన పుట్టిన రోజుని నేషనల్ స్పోర్ట్స్ డే గా జరుపుకుంటున్నాము.16వ ఏట సైన్యం లో చేరాడు. మేజర్ తివారీ ప్రోత్సాహంతో హాకీ లోపట్టు సాధించాడు. వెయ్యికి పైగా గోల్స్ ఖాతా లో చేర్చాడు.1936లో బెర్లీన్ ఒలింపిక్సు లో పాల్గొన్నాడు.జర్మనీ తో ఆట!హిట్లర్ ధ్యాన్చంద్ ఆట చూస్తూ తన దేశం ఓడిపోతుందనే కక్షతో కొత్త  హాకీ స్టిక్ ఇవ్వమని ఆదేశించాడు.దానితో ఆడి మెరుపులా గోల్స్ చేసే ధ్యాన్చంద్ జర్మనీ ని ఓడిస్తాడని ఊహించి మ్యాచ్ పూర్తిగా చూడకుండా వెళ్లి పోయాడు. హాలెండ్ లో కూడా  ధ్యాన్చంద్ ఆటచూసి అతను హాకీస్టిక్ కి అయస్కాంతం అతికించాడా అనే అనుమానం తో స్టిక్ ని విరగకొట్టి చూశారుట!" పి.టి.సార్  మాటలు ముగించగానే చప్పట్లతో పిల్లలు సందడి చేశారు 🌹
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం