ధనుర్మాసం! (చిట్టి కవిత )అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాద్

 ధనుర్మాసంతో ప్రారంభం
శ్రీవిల్లి పుత్తూరు పూజ ఉత్సవాలు!
విల్లి మహారాజు కి స్వప్నంలో
వటపత్రసాయి దర్శనం!
పుట్ట ఆధారంగా వెలసె
విల్లి పుత్తూరు!
పదమూడు అంతస్తుల గోపురం!
తమిళనాడు రాష్ట్ర చిహ్నం!
తులసివనంలో బోసినవ్వుల 
పసిపాప!
కోతై మాలిక అనిపిల్చే
శ్రీ విష్ణు చిత్తులు!
కృష్ణ భక్తితో తులసిమాలలు
పూమాలలు తాను ధరియించి
స్వామికి అర్పించే గోదాదేవి!
ఆండాళ్ గా వాసికెక్కే!
పాశురాలతో జగతి నుద్ధరించే!🌷
కామెంట్‌లు