వెంకటాపురం గ్రామంలో రాఘవయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. ఇతడు బాగా పిసినారి. పేదలకు సహాయం చేసేవాడు కాదు. అదే ఊర్లో శేఖర్ అనే పేదవాడు ఉండేవాడు. శేఖర్ రాఘవయ్య వద్దకు వచ్చి ఏదైనా పని ఇప్పించండి చేస్తాను అని అడిగాడు. రాఘవయ్య అహంకారంతో ఇలాంటి పేదవాళ్లను పనిలో పెట్టుకుంటే నా సొమ్మంతా దొంగిలిస్తారు. అవసరంలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు దయచేసి నాకు ఏదైనా పని చూపించండి అని శేఖర్ బతిమిలాడి నాడు. అయినా రాఘవయ్య ఒప్పుకోలేదు.
కొంతకాలానికి రాఘవయ్య తన బైక్ పై పట్నం నుండి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదానికి గురై కిందపడ్డాడు. తల పగిలింది రక్తం తీవ్రంగా కారుతుంది. అటు నుంచి వచ్చిన శేఖర్ ఇది చూసాడు. రాఘవయ్యను గుర్తుపట్టి వెంటనే అటువైపు వస్తున్న ఒక ఆటో వ్యక్తిని బ్రతిమిలాడి నల్లగొండ ఆసుపత్రికి తీసుకుపోయినాడు. రాఘవయ్యకు రక్తం ఎక్కించాలి అని డాక్టర్ చెప్పినప్పుడు శేఖర్ తన రక్తాన్ని ఇచ్చి రాఘవయ్య ప్రాణాలు కాపాడాడు. ఆ తరువాత రాఘవయ్య భార్య పిల్లలకు ఫోన్ చేసి చెప్పాడు. రాఘవయ్య కోలుకున్న తర్వాత శేఖర్ వల్లనే తాను బతికానని తెలుసుకొని తాను పొగరుబోతు తనంతో శేఖరు అవమానించానని ఎంతో బాధపడ్డాడు. శేఖర్ కు ఎంతో సహాయం చేశాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి